లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన పోషన్న (55) అనే మత్స్యకారుడు శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు చెరువులో నీట మునిగి మృతి చెందాడు. చేపలు పట్టే వల కాలుకు చుట్టుకోవడంతో నీటిలో పడిపోయి, ఊపిరాడక మరణించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గాలించగా, శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.