భోరజ్ మండలం ఆకోలి గ్రామంలో, తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన 17 ఏళ్ల బాలిక ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్నానం చేయాలని తండ్రి ముక్యే సంతోష్ మందలించడంతో, తల్లి బీపీ మాత్రలను అధిక మోతాదులో మింగి ఈ చర్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి, 108కు సమాచారం అందించడంతో సకాలంలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.