తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రెండో విడత రూ.6,000 ఆర్థిక సహాయాన్ని ఏప్రిల్ 15 లోపు (అంటే మరో వారంలో) ఖాతాల్లో జమ చేయనుంది. ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు ఈ నిధులను పొందుతారు. ఇప్పటికే తొలి విడతలో 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేశారు. రెండో విడత కోసం సుమారు రూ.2,700 కోట్లు కేటాయించింది. ఇక మూడో విడత కింద ఏప్రిల్ చివరి నాటికి రైతుల అకౌంట్‌లోకి నగదు జమ కానుంది.