
పర్యాటకులతో కిటకిటలాడుతున్న శ్రీనగర్ తులిప్ గార్డెన్
శ్రీనగర్‌లోని ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ఈ సీజన్లో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులతో సందడిగా మారింది. వసంతకాలంలో వికసించే తులిప్ పూల అందాలను ఆస్వాదించడానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ఈ ఉద్యానవనం పర్యాటకులకు కనుల విందుగా మారింది.




