ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వస్తున్న లారీ, బైక్ను శనివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మడావి భీమ్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని నిర్మల్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.