బుధవారం రాత్రి అక్కాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన ధావతి ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. నిర్మల్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుండగా, రైతులు రోడ్డుపై ఆరబెట్టిన సోయాబీన్ కుప్పపై నుంచి ద్విచక్రవాహనం వెళ్లడంతో అదుపుతప్పి పడిపోయి, తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.