నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం కాల్వ గ్రామంలో ఇంటి నిర్మాణ పనుల్లో శనివారం ప్రమాదం జరిగింది. శ్రీరామ్ భాగ్యలక్ష్మి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతుండగా పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలు మేస్త్రీకి తగలడంతో కరెంట్ షాక్‌కు గురై కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యుత్ తీగలను తొలగించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని భాగ్యలక్ష్మి ఆరోపించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా, ఖానాపూర్ లో జరిగింది.