ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుండి పబ్లిక్ గార్డెన్ ఎక్స్ రోడ్ వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ (ఏక్తా ర్యాలీ)లో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తో కలిసి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యత కొరకు చేసిన విశేష కృషిని గుర్తుచేసుకున్నారు.