నిర్మల్ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల స్వీకరణలో తొలిరోజు బోణీ లేదు

0చూసినవారు
పురపాలక ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలలో అత్యధిక వార్డులున్న నిర్మల్ నుండి నామినేషన్లు రాకపోవడంపై ఆశవాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ విధించిన తక్కువ సమయం, నూతన నిబంధనలే దీనికి కారణమని వారు పేర్కొంటున్నారు. ఇది నిర్మల్ మున్సిపల్ చరిత్రలో ఇదే తొలిసారని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్