నిర్మల్: పదవీ విరమణ పొందిన టీచర్లకు గమనిక

366చూసినవారు
నిర్మల్: పదవీ విరమణ పొందిన టీచర్లకు గమనిక
ఫిబ్రవరి 28న పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ సంతకంతో కూడిన ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్