నిర్మల్: పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

50చూసినవారు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు డిఎస్పీ గంగారెడ్డి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక వినియోగం, షీటీం, భరోసా, సైబర్ సెక్యూరిటీ, డాగ్ స్క్వాడ్ తదితర విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్