నిర్మల్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

4చూసినవారు
నిర్మల్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 17 ఏళ్ల బాలికను గర్భిణిని చేసిన 21 ఏళ్ల రాజేశ్‌పై పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండుకు తరలించినట్లు కడెం ఎస్సై సాయికిరణ్ తెలిపారు. దస్తురాబాద్ మండలంలోని గొడిసిర్యాలకు చెందిన రాజేశ్, అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మోసగించినట్లు గురువారం ఫిర్యాదు అందింది. శుక్రవారం నిర్మల్ ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్ విచారణ జరిపి, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్