నిర్మల్ రోడ్ల మరమ్మత్తులు: కలెక్టర్ అభిలాష అధికారులకు ఆదేశాలు

1చూసినవారు
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పట్టణంలో రోడ్ల మరమ్మత్తు పనులు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం బస్టాండ్, అంబేద్కర్ చౌక్ సమీపంలో జరుగుతున్న పనులను పరిశీలించి, గత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను సకాలంలో మరమ్మత్తు చేయాలని, గుంతల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మరమ్మత్తు పనులన్నీ నాణ్యతతో చేపట్టాలని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్