జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు. స్టేడియం ప్రహరీ గోడ నిర్మాణం నేపథ్యంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించారు. స్టేడియం ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.