జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకుని ప్రజలు తమ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎస్. శ్రీవాణతో కలిసి ఆమె పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు రాజీకి వచ్చి త్వరితంగా న్యాయం పొందవచ్చని తెలిపారు. కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చన్నారు