దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదులు, యూనిఫామ్, పాఠ్యపుస్తకాల పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నందున విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.