నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయడానికి జిల్లా శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని, నిర్మల్ జిల్లా చరిత్రను తెలియజేసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 19 నుండి 23 వరకు జరిగే ఉత్సవాలకు ప్రోటోకాల్ పాటిస్తూ ప్రజాప్రతినిధులను, ప్రముఖులను ఆహ్వానించాలని తెలిపారు.