సారంగపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన రసూల్ సాయి (26) అనే యువకుడు మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి చిన్నతనంలోనే మృతి చెందడంతో తాత, నానమ్మల వద్ద పెరిగిన సాయి, డబ్బుల కోసం వారిని వేధించేవాడు. దీంతో వారు వేరే చోట అద్దెకు ఉంటున్నారు. అతిగా మద్యం సేవించి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు.