నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో సోమవారం ఉదయం నుండి పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయిల్ కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపులు చేసినప్పటికీ, ఇంధనం సరఫరా కావడానికి రెండు నుండి మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఈ ఇంధన కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.