సోన్ మండలంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. సోమవారం నాటికి 7 క్లస్టర్లలో 45 మంది సర్పంచ్ అభ్యర్థులు, 109 మంది వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీడీవో సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, పోటీదారులు తమ మద్దతుదారులతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు సమర్పించారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో యువత అధిక సంఖ్యలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.