నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అర్బన్, మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కోకో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడలు నిర్వహించబడతాయి. డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటివరకు 450 మంది క్రీడాకారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని టీజీపేట అధ్యక్ష, కార్యదర్శులు సత్తయ్య, వన్నెల భూమన్నలు తెలిపారు.