దిలావర్‌పూర్ మండలం కదిలి గ్రామస్తులు వరుణదేవుడి కరుణ కోసం వినూత్నంగా పూజలు నిర్వహించారు. సోమవారం, పురాతన శ్రీశ్రీశ్రీ మాతన్నపూర్ణ కదిలే పాపహరేశ్వర ఆలయంలో గ్రామస్తులు పవిత్ర గోదావరి జలాలతో పాటు ఆలయ ఆవరణలోని కోనేటి నుంచి నీటిని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశారు. ఆలయ గర్భగుడిలో నీరు నింపి స్వామివారికి నీరాజనం సమర్పించి, వర్షాలు సమృద్ధిగా కురవాలని, చెరువులు నిండాలని, పాడి పంటలు పండాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.