ఆలయంలో విగ్రహాల నిర్లక్ష్యం పక్కకు పడేసిన పాత విగ్రహాలు

11చూసినవారు
ఆలయంలో విగ్రహాల నిర్లక్ష్యం పక్కకు పడేసిన పాత విగ్రహాలు
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ ఆలయంలో పురాతన విగ్రహాలను దేవాదాయశాఖ అధికారులు తొలగించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పునః నిర్మాణ సమయంలో పోచమ్మ తల్లి విగ్రహంతో పాటు సప్త మాతృకల విగ్రహాలను బాలాలయంలో ఏర్పాటు చేశారు. కొత్త ఆలయంలో అమ్మవారి మూల విగ్రహాన్ని ప్రతిష్టించగా, మిగిలిన విగ్రహాలను తొలగించారు. శాస్త్ర ప్రకారం గోదావరి నదిలో విసర్జన చేయాల్సిన విగ్రహాలను ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పక్కకు పాడేయడంపై భక్తులు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :