మొక్కజొన్న కొనుగోళ్లలో ఆన్‌లైన్ సమస్యలతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏఈవోలు నమోదు చేశామని చెబుతున్నా, పోర్టల్‌లో వివరాలు నమోదు కాకపోవడంతో పంటను అమ్ముకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. "నమోదు కాలేదని సెంటర్‌లో తూకం వేయడం లేదు.. అధికారులను అడిగితే చేశామంటున్నారు" అని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల భయం పొంచి ఉన్నందున, అధికారులు వెంటనే స్పందించి తమ పంటను కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.