పి. నర్సారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి జూపల్లి కృష్ణారావు

0చూసినవారు
పి. నర్సారెడ్డి సేవలు చిరస్మరణీయం: మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజాసేవను జీవిత ధ్యేయంగా చేసుకుని నిస్వార్థంగా పనిచేసిన మహానేత పొద్దుటూరి నర్సారెడ్డి సేవలు చిరస్మరణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి శనివారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా నర్సారెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్