దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో ఆదివారం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గట్టు నర్సయ్య అధ్యక్షులుగా, అంగూర్ మహేందర్, గోగుర్ల నవీన్ కోశాధికారులుగా, పదిమంది క్రియాశీల సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంగూర్ మహేందర్, ఉప సర్పంచ్ హరికృష్ణ, మాజీ సర్పంచ్ లు నర్సారెడ్డి, శ్రీనివాస్, సీనియర్ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.