నిర్మల్ డిపో మేనేజర్ పండరి ప్రయాణికులను ఆర్టీసీని ఆదరించాలని కోరారు. బుధవారం నిర్మల్ నుండి పూరి జగన్నాథ్ యాత్రకు రెండు ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. ఈ బస్సులు అన్నవరం, సింహాచలం, అర్సవెల్లి, పూరి జగన్నాథ్, కోణార్క్, విశాఖపట్నం బీచ్, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలను దర్శింపజేస్తాయి. ఈ నెల 9న బస్సులు నిర్మల్ కు తిరిగి చేరుకుంటాయని, ప్రయాణికులకు మేనేజర్ శుభాకాంక్షలు తెలిపారు.