మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

2చూసినవారు
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. గత 8 నెలలుగా బిల్లులు రాక కార్మికులు అవస్థలు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం పదివేల వేతనం చెల్లించాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి బుక్యా రమేష్ కోరారు. అనంతరం డీఈఓకు వినతిపత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you