తెలంగాణ ప్రైవేటు డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేష్ గౌడ్, అఖిలేష్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రూ. 8,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని తెలిపారు. నిధులు లేక కళాశాలలు నడపడం కష్టమవుతోందని, ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో కళాశాలలు నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు వారు జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వివరించారు.