కేంద్ర పథకాలతో ఆకర్షితులై బీజేపీలో చేరికలు: ఎమ్మెల్యే ఏలేటి

0చూసినవారు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు బీజేపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి సంగం పేట మాజీ సర్పంచ్ సాగర్ తో పాటు పలువురు బీజేపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఏలేటి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ సుస్థిర పాలనకు ఆకర్షితులై వందలాదిగా ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్