కాలువలు శుభ్రం చేయకపోవడంతో కాలనీల్లో దుర్వాసన, ప్రజల ఆవేదన

0చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీ, అస్రా కాలనీ, ఆదర్శనగర్, సోఫీ నగర్, శాంతినగర్, నాయుడువాడ, గాజులపేట, కురన్నపేట వంటి శివారు ప్రాంతాలలో నెలల తరబడి మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో ఆయా ప్రాంతాలు దుర్వాసనతో నిండిపోతున్నాయి. దీనితో పాటు కుక్కలు, కోతుల బెడద కూడా తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్