నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాలు - 2026 కు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. జనవరి 31 వరకు ఈ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోజువారీ కార్యక్రమాలు చేపట్టాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ విష్ణువర్ధన్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.