ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

1చూసినవారు
ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో త్రాగునీటి అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీటి కొరత రాకూడదని, గతంలో నీటి సమస్య ఏర్పడిన ప్రాంతాలను గుర్తించి, ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రోజువారి నీటి సరఫరాలో ఆటంకాలు ఎదురైతే, సమస్యలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్