నిర్మల్ పట్టణంలోని పలు వీధుల్లో పందులు స్వేచ్ఛగా తిరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో, నిలిచిపోయిన మురికినీరు, చెత్తాచెదారం వల్ల పరిసరాలు దుర్గంధభరితంగా మారాయి. పందుల సంచారం వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.