కడ్తాల్‌లో పోచమ్మ తల్లి గంగనీళ్ల జాతర నిర్వహణ

675చూసినవారు
కడ్తాల్‌లో పోచమ్మ తల్లి గంగనీళ్ల జాతర నిర్వహణ
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో ఆదివారం పోచమ్మ తల్లి గంగనీళ్ల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన పోచమ్మ తల్లి ఆభరణాలకు శనివారం సాయంత్రం గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం తెల్లవారుజామున సోన్ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం పాదయాత్రగా గ్రామానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్