నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ జానకి షర్మిల గురువారం తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచి, అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేసి, ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.