కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళను కాపాడిన పోలీసులు

0చూసినవారు
కుటుంబ కలహాలతో గోదావరిలో దూకిన మహిళను కాపాడిన పోలీసులు
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను బాసర పోలీసులు శుక్రవారం కాపాడారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఈ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో బాసర గోదావరికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ఘాట్ సిబ్బంది, పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను ఒడ్డుకు చేర్చారు. అనంతరం, బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించి, సీఐ దీపక్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత, ఆమె తండ్రికి సమాచారం అందించి, అతనికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్