నిర్మల్ జిల్లా, మామడ మండల కేంద్రంలో ఆదివారం 0 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ గోవర్ధన్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.