తానూర్ మండలంలోని బోల్సా గ్రామంలో సర్పంచ్ సుదర్శన్ చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేశారు. సమాజం నుండి పోలియోను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.