నిర్మల్-నిజామాబాద్ రహదారిపై గుంతలమయం, వాహనదారుల ఆగ్రహం
నిర్మల్ జిల్లా కేంద్రం నుండి నిజామాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు పెను ప్రమాదంగా మారాయి. భారీ, సాధారణ వాహనాలు నిత్యం వందలాదిగా తిరిగే ఈ రహదారి దుస్థితిపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా పాడైందని, కనీసం గుంతలు పూడ్చే పని కూడా చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.