నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్ 33/11కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ శ్రీనివాస్ రావు శనివారం తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు దివ్యనగర్, దత్తాత్రేయ నగర్, ఏఎన్ రెడ్డి కాలనీ, శాస్త్రినగర్, శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, గాయత్రి టౌన్ షిప్, బ్రహ్మపురి, షేక్ సాహెబ్ పేట్, వెంకటాద్రిపేట్, గుల్జార్ మార్కెట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని కోరారు.