జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం నిలిపివేయబడుతుందని, కోడ్ ముగిసిన వెంటనే యథావిధిగా తిరిగి ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.