విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్!

1చూసినవారు
విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్!
లోకేశ్వరం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం రెండవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒక విద్యార్థిని తల పగిలిందని ఆగ్రహించిన పాఠశాల ప్రిన్సిపాల్, ఆ విద్యార్థినిని ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిలో బాలిక దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేసుకున్నా వదలకుండా కొట్టారని, దీంతో ఆమె వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయని బాధితురాలి తండ్రి సాయన్న తెలిపారు. రాత్రంతా జ్వరంతో బాధపడుతూ, భయాందోళనలకు గురైన బాలిక పాఠశాలకు వెళ్లడానికి భయపడుతోందని, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్