దొంగతనం కేసులో నిందితులకు జైలు శిక్ష

0చూసినవారు
దొంగతనం కేసులో నిందితులకు జైలు శిక్ష
నిర్మల్ జిల్లా కేంద్రంలో 2024లో శ్రీనివాస్, సుజాత కలిసి బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి మెడలో నుంచి ఆరు గ్రాముల బంగారు గొలుసు, మొబైల్ ఫోన్ దొంగిలించారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి నిందితులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 2500 జరిమానా విధించారు. ఈ వివరాలను ఎస్పీ జానకి షర్మిల మంగళవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్