ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ చేపట్టిన కళాశాలల బంద్ రెండో రోజు కొనసాగింది. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద నిరసన తెలిపి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గ్రామీణ విద్యార్థులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందని, అయితే నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు అప్పులు చేసి జీతభత్యాలు చెల్లిస్తున్నామని, వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వారు కోరారు.