కడ్తాల్ లో భీమన్న దేవుని గజాల ఊరేగింపు

0చూసినవారు
కడ్తాల్ లో భీమన్న దేవుని గజాల ఊరేగింపు
శనివారం, కడ్తాల్ గ్రామంలో భీమన్న దేవుని గజాల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర గంగ స్నానానికి తీసుకెళ్లే ముందు, గజాలను గ్రామంలోని ఇంటింటికీ భాజాబజంత్రీల నడుమ సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా ఊరేగించారు. మహిళలు గజాలకు పసుపు, కుంకుమలు సమర్పించి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం గంగస్నానం, సోమవారం భీమన్న జాతర జరుగుతాయని గ్రామ సర్పంచ్ గుర్రం రాము, ముదిరాజ్ కులస్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్