నిర్మల్ పట్టణ అభివృద్ధికి మంజూరైన పాత టెండర్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషి ఫలితంగానే నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చారని, పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించగా, నిర్మల్ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహకరిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.