ప్రజల సౌలభ్యం కోసం భైంసా పట్టణంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భైంసా క్యాంప్ ఆఫీస్ లో నేరుగా ఎస్పీకి అర్జీలు, ఫిర్యాదులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. బైంసా సబ్ డివిజనల్ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.