ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

413చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని, మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్