తానూర్ మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యానీకేతన్ హైస్కూల్ ఉపాధ్యాయుడు రాజన్నకు నిర్మల్ జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో ఆయనను యాజమాన్యం శాలువాతో ఘనంగా సన్మానించింది. డీఈఓ, ఎంఈఓ, ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా రాజన్న ఈ పురస్కారాన్ని అందుకున్నందుకుగాను జి. డైరెక్టర్ అవినాష్, ప్రిన్సిపాల్ ఉషాకిరణ్మాయి, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.